థామస్
ఆల్వా ఎడిసన్
(ఫిబ్రవరి 11,
1847 – అక్టోబర్ 18, 1931)
ఫిబ్రవరి
11, 1847న అమెరికాలో జన్మించిన థామస్ ఆల్వా ఎడిసన్ తల్లిదండ్రులు డచ్, స్కాట్లాండ్
కు చెందినవారు. ఎడిసన్ అమెరికా లోని ఓహియో రాష్ట్రానికి చెందిన మిలన్ అనే
ప్రాంతంలో జన్మించి మిషిగాన్ రాష్ట్రంలోని పోర్టుహ్యురాన్ అనే ప్రదేశంలో పెరిగాడు.
తండ్రి శామ్యూల్ ఆగ్డెన్ ఎడిసన్ జూనియర్ మరియు తల్లి నాన్సీ మాథ్యూస్ ఎడిసన్ లకు
ఏడవ మరియు చివరి సంతానం.
16 ఏళ్ళకే టెలిగ్రాఫ్ ఆపరే టర్ అయ్యాడు. ఆటోమేటిక్ టెలిగ్రాఫ్
కోసం ట్రాన్స్‌మీటర్, రిసీవర్లను కనిపెట్టడం ఆయన మొదటి ఆవిష్కరణ.
డిసెంబర్
25, 1871న 24 సంవత్సరాల వయసులోఎడిసన్16
యేళ్ళ మారీ స్టిల్ వెల్ ను
వివాహమాడాడు. వీరికి ముగ్గురు సంతానం మరియన్ ఎడిసన్ ,థామస్ అల్వా ఎడిసన్ జూనియర్ , విలియం లెస్ల్య ఎడిసన్.
ఎడిసన్ మొదటగా న్యూజెర్సీ లోని నెవార్క్ లో పరిశోధకుడిగా
తన ప్రస్థానాన్ని ఆరంభించాడు. ఆయన మొదట పని చేసినవి ఆటోమాటిక్ రిపీటర్ మరియు
టెలిగ్రాఫిక్ పరికరాలు కానీ అతనికి పేరు తెచ్చి పెట్టినది మాత్రం 1877 లో
కనిపెట్టబడిన ఫోనోగ్రాఫ్. ఈ పరికరాన్ని కనిపెట్టినపుడు ప్రజలు సంభ్రమాశ్చర్యాలకు
గురయ్యారు. ఆయనకు మెన్లో పార్క్ మాంత్రికుడు అనే పేరు పెట్టారు.1877లో
ఫోనోగ్రాఫ్‌ను కనుగొన్నాడు. 40 గంటలపాటు పనిచేసే కా ర్బనైజ్‌డ్ కార్బన్ త్రెడ్
ఫిలమెంట్‌ను తయారు చేసి 1879 అక్టోబర్ 21న ప్రయోగాత్మకంగా
ప్రదర్శించాడు.థామస్ అల్వా ఎడిసన్ మానవ
జాతిని ప్రభావితం చేసిన విద్యుత్ బల్బు, ఫోనోగ్రాఫ్
లాంటి అనేక ఉపకరణాలను రూపొందించిన ఒక గొప్ప శాస్త్రవేత్త మరియు వ్యాపారవేత్త.
1882లో న్యూయార్క్‌లో విద్యుత్ స్టేషన్‌ను స్థాపించాడు. కైనెటోస్కోప్ ప్రాసెస్ ద్వారా 1890లో మోషన్ పిక్చర్స్‌ను తీయడం మొదలుపెట్టాడు. మైనింగ్, బ్యాటరీ, రబ్బర్, సిమెంట్ రక్షణోత్పత్తులు-మన జీవి తంలో భాగమైపోయిన ఎన్నింటికో ఎడిసన్ ఆద్యుడు. ఆయన ఆవిష్కరణలు సమాజం రూపురేఖలనే మార్చివేశాయి. ఆవిరి యంత్ర దశ నుండి విద్యుత్‌కాంతుల్లోకి నాగరికత ప యనించడానికి ఆయన పరిశోధనలే కారణం. 1300 ఆవిష్కరణలపై పేటెంట్ హక్కులు పొందాడు. ఆయన అంత్యక్రియల రోజు ఆయన గౌరవార్ధం అమెరికా ప్రజలు తమ గృహాల్లో లైట్లను ఆర్పివేసి నివాళి అర్పించారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి