గెలీలియో గెలిలీ
(DATE OF BIRTH -1564 ఫిబ్రవరి 15)
(DATE OF BIRTH -1564 ఫిబ్రవరి 15)
కొన్ని వందల సంవత్సరాలకు పూర్వం 'భూమి చుట్టూ సూర్యుడు, గ్రహాలు, నక్షత్రాలు తిరుగుతున్నాయి అనే నమ్మేవారు. అంతే కాదు, కాదనే వారిని వ్యతిరేకించేవారుకూడా. అలాంటి రోజుల్లో సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతోందని నిరూపించిన శాస్త్రవేత్తే గెలీలియో గెలీలి.
ఆధునిక భౌతిక శాస్త్రం, పరిశీలనాత్మక ఖగోళ శాస్త్రాలకు పితామహుడిగా పేరొందిన గెలీలియో గణిత,తత్వవేత్తగా కూడా
విజ్ఞాన శాస్త్రాన్ని మేలిమలుపు తిప్పాడు. పీసా టవర్ నుంచి 1 పౌండు, 100 పౌండ్ల బరువున్న
రెండుఇనుప గుండ్లను ఒకేసారి కిందకి వదిలి అవి రెండూ
ఏకకాలంలో భూమికి చేరుకుంటాయని
నిరూపించి అప్పటి నమ్మకాలను తప్పని నిరూపించింది కూడా ఇతడే.
ఇటలీలోని పీసా నగరంలో 1564 ఫిబ్రవరి 15న ఆరుగురి సంతానంలో పెద్దవాడిగా పుట్టిన గెలీలియో 11 ఏళ్లవరకూ తండ్రి వద్దనే విద్య నేర్చుకున్నాడు. తండ్రి కోరికపై వైద్య విద్యార్థిగా చేరినా, మధ్యలో గణిత శాస్త్ర అధ్యయనంచేపట్టాడు. టెలిస్కోపును అభివృద్ధి చేసి, దానిని అంతరిక్షం
కేసి తిప్పి, తొలిసారిగా
విశ్వరూపాన్ని వీక్షించిన తొలిశాస్త్రవేత్త అతడేనని చెప్పవచ్చు. అతడికి
ముందే కోపర్నికస్ అనే శాస్త్రవేత్త సూర్యుడి చుట్టూ భూమి, ఇతర గ్రహాలు తిరుగుతున్నాయనేసూర్యకేంద్రక సిద్ధాంతాన్ని
ప్రతిపాదించాడు. గెలీలియో టెలిస్కోపు సాయంతో ఆ సిద్ధాంతం నిజమేనని
నిరూపించగలిగాడు. సూర్యునిలో మచ్చలను, శుక్రుని
దశలను,
జ్యూపిటర్ ఉపగ్రహాలను గుర్తించడం, సామాన్యులకు ఉపయోగపడే కప్పీలు, తులాదండాలు, వాలుతలాల ద్వారా బరువులను ఎత్తగలిగే సూత్రాలన
జ్యూపిటర్ ఉపగ్రహాలను గుర్తించడం, సామాన్యులకు ఉపయోగపడే కప్పీలు, తులాదండాలు, వాలుతలాల ద్వారా బరువులను ఎత్తగలిగే సూత్రాలన
చాటి చెప్పే యాంత్రికశాస్త్రాన్ని రచించడం, వాయు ధర్మామీటర్, లోతు
నుంచి ఎత్తుకు నీటిని పంపే పరికరం, గణితంలో
వర్గాలు, వర్గమూలాల్ని కనుగొనే కంపాస్‌ల రూపకల్పన లాంటి ఎన్నో
పరిశోధనలు చేశాడు.
అతడు సమర్థించే సూర్యకేంద్రక సిద్ధాంతం మతవిశ్వాసాలకు వ్యతిరేకంగా ఉందని ఆగ్రహించిన మతాధిపతులు 1623లో గెలీలియో రచించిన పుస్తకాల ముద్రణను నిలిపివేయడమే కాకుండా, కారాగార శిక్ష సైతంవిధించారు. కారాగారంలోనే చూపును కోల్పోయిన గెలీలియోఆ శిక్షను అనుభవిస్తూనే తన 78వ ఏట మరణించాడు. ఆయన రాసిన పుస్తకాలలో 'టూ న్యూ సైన్సెస్' అనేది ఈనాటిభౌతిక శాస్త్రం మాతృక!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి