సర్ ఐజాక్ న్యూటన్
(డిసెంబరు 25, 1642 - మార్చి 20, 1727)
ఒక
ఆంగ్లేయ భౌతిక, గణిత, ఖగోళ శాస్త్రవేత్త, ఒక సిద్ధాంత కర్త మరియు
తత్వవేత్త
కూడా. ఆధునిక ప్రపంచం న్యూటన్ను సైన్సు పితామహుడిగా గౌరవిస్తుంది.
సర్
ఐజాక్ న్యూటన్, ఇంగ్లాండ్
లో డిసెంబర్ 25, 1642
సంవత్సరమున జన్మించాడు. న్యూటన్ తండ్రి న్యూటన్ జననానికి మూడు నెలల ముందు
మరణించారు. న్యూటన్ తన తల్లి సంరక్షణ క్రింద 3 సంవత్సరాల వయస్సు
వరకు ఉన్నారు.
తరువాత న్యూటన్ కేవలం 3 సంవత్సరాల వయస్సు
ఉన్నప్పుడు, ఆమె బార్ స్మిత్ అనే ఆయన్ను రెండవ
వివాహం
చేసుకున్నారు. అందువలన న్యూటన్ తన చిన్నతనంలో తన
తల్లితండ్రుల ప్రేమ
కోల్పోయి తన అమ్మమ్మ-తాతల వద్ద పెరగటం
జరిగింది. న్యూటన్ తన బలహీనమైన ఆరోగ్యం వలన
ఆటల వైపు
ఎక్కువగా ఆసక్తి చూపించ లేదు. ఆయన చాలా తక్కువగా మాట్లాడేవారు.
12
ఏళ్ల వయస్సులో న్యూటన్ గ్రామర్ స్కూల్ లో ఉన్నప్పుడు తన
మేధోశక్తితో అందరిని
ఆకట్టుకున్నారు. న్యూటన్ ఎల్లప్పుడూ భౌతిక,
గణిత శాస్త్రాలకు సంబంధించిన సమస్యలను
మాత్రమే పరిష్కరించటానికి ఇష్టపడేవారు. లైబ్రరీ లో చాలా సమయం అతను పుస్తక పఠనంలో
గడిపేవారు. గణితంలో న్యూటన్ పట్ల ఎంతో ఆసక్తి చూసిన ఒక
ఉపాధ్యాయుడు, న్యూటన్ ను ఉన్నత విద్యను
అభ్యసించడానికి విశ్వవిద్యాలయానికి పంపండని న్యూటన్ తల్లి కి గట్టిగా చెప్పారు. ఆ
ఉపాధ్యాయుడు న్యూటన్ యొక్క విద్యకు అయ్యే ఖర్చును భరించటానికి అంగీకరించారు.
న్యూటన్ కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో చేరి భౌతిక, గణిత
శాస్త్రాల అధ్యయనం ప్రారంభించారు.పూర్తి
సమయం లెక్కలు మరియు
భౌతిక శాస్త్రం అభ్యాసానికే వినియోగించారు. ఆయన ఎంతలా
నిమగ్న
మయ్యారంటే ఒక్కొక్కసారి తిండి నిద్ర కూడా మరిచేవారు. న్యూటన్
యూనివర్సిటీలో
గ్రీకు, లాటిన్, హిబ్రు భాషలను, లాజిక్, జ్యామితి
మరియు త్రికోణమితి లను
ఎంచుకున్నారు. లైబ్రరీ లో న్యూటన్ తరచుగామేధావులైన కెప్లర్ మరియు ఇతరులు రాసిన /
తయారుచేసిన
గొప్ప ప్రయోగాలపై అధ్యయనం చేసేవారు.న్యూటన్
1969లో ట్రినిటీ
కాలేజిలో ఉండే సమయంలో తన ఆలోచనలను పుస్తకాలలో
రాసుకున్నారు. ఆ
పుస్తకాలు న్యూటన్ఆలోచనా ధోరణిని బహిర్గతం
చేస్తూ ఇప్పటికీ ఎంతో ముఖ్యమైనవిగా
పరిగణింపబడతాయి. న్యూటన్
1665 లో కేంబ్రిడ్జి యూనివర్సిటీ నుండి బాచిలర్ డిగ్రీ
పొందారు. అదే
సంవత్సరంలో న్యూటన్ ప్రిన్సిపియా అని ఒక సంకలనం తయారు
చేశారు.
అది న్యూటన్ యొక్క మహత్తర పుస్తకంగా, 1687 లో ప్రచురించ
బడినది. న్యూటన్ 1667
లో కేంబ్రిడ్జి తిరిగి తన పరిశోధన కార్యకలాపాలను ప్రారంభించారు. న్యూటన్ 1669 లో
కేంబ్రిడ్జి నుండి మాష్టర్స్ డిగ్రీ పొందారు,
మరియు అదే సంవత్సరంలో గణిత శాస్త్ర
ప్రొఫెసరు గా నియమించబడ్డారు.
ప్రొఫెసర్
న్యూటన్ విశ్లేషణాత్మక జ్యామితి, బీజగణితం, మరియు క్యాల్కులస్ రంగాలమీద తన దృష్టి
సారించారు. బైనామినల్ సిద్ధాంతం, అనంతం సిరీస్
విస్తరణ కోసం కొత్త పద్ధతులు,
fluxions యొక్క
ప్రత్యక్ష మరియు విలోమ
పద్ధతులు – ఇవీ ఆ కాలంలో ఆయన చేసిన ప్రధాన ఆవిష్కరణలు.
న్యూటన్ 1665 నుండి 1666 వరకు కాంతి అధ్యయనం మీద దృష్టి
కేంద్రీకరించారు. కాంతి
యొక్క ఖచ్చితమైన కూర్పు తెలుసుకోవడానికి
అనేక ప్రయోగాలను నిర్వహించారు. ఆయన కాంతి
యొక్క అనేక ఇతర
లక్షణాలను అధ్యయనం చేశారు.రాయల్
సొసైటీ అధ్యక్షుడు "రాబర్ట్ హు్క్"
1703 లో మరణించాడు. అప్పుడు
ప్రొఫెసర్ న్యూటన్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. న్యూటన్ అద్భుతమైన రచయిత, అతను అనేక శాస్త్రీయ
మరియు అశాస్త్రీయ
విషయాల మీద ఎన్నో పుస్తకాలను రాశాడు.
న్యూటన్ దైవీ శాస్త్రం (theology)
మీది రచనలుప్రచురించబడలేదు.
ప్రొఫెసర్
న్యూటన్ సన్నగా, పొడవుగా
ఉండేవారు. న్యూటన్ తన దుస్తులు
మరియు కేశాలంకరణపై ఆసక్తి చూపేవారు కాదు. ఎక్కువ
సమయం
అతను తన సొంత ఆలోచనలలో మునిగిపోయేవారు. ఎప్పుడూ గదిలో
ఒక మూలలో లెక్కలు
చేసుకునేవారు. తీవ్రమైన చర్చలలో కూడా
ఒక్కోక్కసారి సొంత ఆలోచనలలో ఉండేవారు.
న్యూటన్ క్రీడలు,
వ్యాయామం పై ఎటువంటి ఆసక్తి చూపించేవారు కాదు.
అనేక సందర్భాలలో అతను
ఇరవై నాలుగు గంటలలో పద్దెనిమిది
లేదా పందొమ్మిది గంటలు అధ్యయనంలో గడిపేవారు.
ప్రొఫెసర్ న్యూటన్
బ్యాచిలర్ గా ఉండి భౌతిక శాస్త్రం మరియు గణిత శాస్త్ర సేవలకే
అంకితం
చేశారు. న్యూటన్నిజాయితి
మరియు ముక్కుసూటి మనిషి. న్యూటన్
మార్చి 20, 1727 న 84 సంవత్సరాల వయసులో మరణించాడు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి